సదానంద గౌడ కర్ణాటక కొత్త సీఎం
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సదానందగౌడ ఎంపికయ్యారు. రకరకాల మలుపులు, ఒత్తిడులు, గ్రూపు రాజకీయాలు వెరసి గత కొంతకాలంగా కర్నాటకలో జరుగుతున్న రాజకీయ డ్రామా ఓ కొలిక్కి వచ్చింది. మైనింగ్ కుంభకోణం కారణంగా తన పదవికి రాజీనామా చేసిన యడ్యూరప్ప మొత్తానికి తన అనుచరుడు సదానంద గౌడనే ముఖ్యమంత్రిగా చేసుకుని తాను ఓడిపోయినా తన మాటని మాత్రం గెలిపించుకున్నాడు. నేడు ఉదయం నుండి ఎంతో ఉత్కంటతతో కూడిన ఈ ముఖ్యమంత్రి ఎంపిక క్యాపిటల్ హోటల్‌లో జరిగింది. పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రహస్య ఓటింగ్‌లో సదానంద గౌడ ఎక్కువ ఓట్లు సాధించారు. తన ప్రత్యర్థి అయిన జగదీష్ షెట్టర్‌పై ఆరు ఓట్లు ఎక్కువగా సాధించాడు. దీంతో ఆయన సీఎంగా ఎంపికయ్యారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి