అందాల సుంద‌రి న‌గ్న‌శిల్పం..


హాలీవుడ్ అందాల తార‌.. ఎంజిలినా జోలీ.. ఆమె అందానికి ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ముగ్దుల‌యిపోతారు. ఆమె సినిమా వ‌చ్చిందంటే క్యూలు క‌ట్టి మరీ చూస్తారు. అలాంటి ఆ ముద్దు గుమ్మ ఒక అరుదైన రికార్డుని సృష్టించ‌బోతోంది. మ‌న ద‌క్షిణాది సినిమా తార‌ల విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ హీరోయిన్ల‌కి గుళ్ళ‌ని క‌ట్ట‌డం మ‌నం చూశాం. అయితే హాలీవుడ్ అలాంటి సంప్ర‌దాయం లేదు. కానీ ఇప్పుడు ఎంజెలినా కార‌ణంగా అలాంటి ఓ అరుదైన సంఘ‌ట‌న క్రియేట్ కాబోతోంది. దాంతో త్వ‌రలో అమెరికాలోని ఓక్లహోమా సిటీలో ఏంజిలీనా జోలీ నిలువెత్తు నగ్న విగ్రహం త్వరలో అమెరికాలో దర్శనమివ్వబోతోంది. కంచుతో తయారు చేస్తున్న ఏంజీలీనా నగ్న విగ్రహాన్ని శిశువుకు పాలిస్తున్నట్లుగా ఉంటుందట. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ శిల్పి డానియల్ ఎడ్వార్డ్ మాట్లాడుతూ, శిశువుగా పాలిస్తున్నట్లుగా తాను మలుస్తున్న ఏంజిలీనా నగ్న విగ్రహం తల్లుల్లో చైతన్యం తీసుకు వస్తుందని చెప్పాడు. ముఖ్యంగా చంటి పిల్లలకు తల్లిపాలు ఎంత ముఖ్యమో ఈ విగ్రహం తెలియజేస్తుంటున్నాడు. ఈ ఇమేజిని ఏంజిలీనా తన ఇద్దరి కవలలకు పాలిస్తున్నప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ బ్రాడ్ పిట్ ఫోటో తీశాడు. ఆ ఫోటో ఆధారంగా ఈ నగ్న విగ్రహాన్ని తయారు చేస్తున్నానని డామియల్ వెల్లడించాడు. ఇలా న‌గ్న శిల్పాన్ని ఏర్పాటు చేయ‌డం బ‌హుషా ప్ర‌పంచ సినిమా చరిత్ర‌లో ఇదే మొద‌టి సారి అని అంటున్నారు. దాంతో మొద‌టి న‌గ్న‌శిల్పాన్ని ఏర్పాటు చేసిన ఘ‌న‌త ఏంజెలినా జోలీకి ద‌క్కుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!