ల‌గ‌డ‌పాటి.. త‌గ్గు..త‌గ్గు..


విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కట్టడి చేసినట్లు తెలుస్తోంది. 14 ఎఫ్ అంశంపై అనవసరంగా రాద్దాంతం చేయవద్దని ముఖ్యమంత్రి విజయవాడ ఎమ్.పికి చాలా స్పష్టంగా చెప్పారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం 14 ఎఫ్ ను రద్దు చేయడం సాధ్యం కాదని లగడపాటి రాజగోపాల్ అనడంపై తెలంగాణ ఉద్యమనేతలు తీవ్రంగా మండి పడ్డారు. ఆ మీదట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు ఫోన్ చేసి ఈ అంశంపై మాట్లాడవద్దని, దానివల్ల అనసరంగా సెంటిమెంటును రెచ్చగొట్టినట్లవుతుందని తెలంగాణ నేతలు భావిస్తున్నారని చెప్పారు. పైగా 14 ఎఫ్‌ రద్దు చేసినందువల్ల సీమాంధ్ర ప్రాంతానికి వచ్చే నష్టం కూడా లేదని కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రాంత నేతలకు వివరిస్తున్నారు. నిజానికి తెలంగాణ లోని ఉత్తర తెలంగాణ జిల్లాలకు కూడా ఉపయోగపడే ఆ నిబంధనను వద్దని ఆ ప్రాంత నేతలే చెబుతున్నందున ఎవరేమి చేయగలరిన అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందువల్ల దీనిపై సీమాంధ్ర నేతలు వ్యతిరేకంగా మాట్లాడి పరిస్థితిని విషమించేలా చేయవద్దని ముఖ్యమంత్రి కోరుతున్నారు.దాంతో లగడపాటి రాజగోపాల్ కూడా గత కొన్నాళ్లుగా ఈ విషయం జోలికి వెళ్లడం లేదని అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!