అల్లర్లతో అట్టుడికిన లండ‌న్‌


ప్రభుత్వ వ్యయంలో కోత విధించడానికి, 2015 నాటికి లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలపై కోత విధిస్తారని ఆరోపిస్తూ లండ‌న్‌లో కొంద‌రు అల్లరి మూక‌లు చేస్తున్న హింస సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఓ నల్లజాతీయుడి ఎన్‌కౌంటర్‌తో ఈ అల్లర్లు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అల్లర్లను అదుపు చేయడం ప్రధాని కామెరూన్‌కు అగ్నిపరీక్షగా మారింది. ఇప్పటి వరకు 450 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
గత నాలుగు రోజులుగా లండన్ నగరం హింస, లూటీలతో అట్టుడికిపోతోంది. లండన్‌లో ప్రారంభమైన అల్లర్లు మరో మూడు ప్రధాన నగరాలకు కూడా వ్యాపించాయి. బ్రిటన్‌లో 1980 తర్వాత ఇంతటి అల్లర్లు చెలరేగడం ఇదే ప్రథమం. అల్లరి మూకలు లండన్‌లో భవనాలకు, వాహనాలకు, చెత్త కుప్పలకు నిప్పు అంటిస్తూ వెళ్లిపోయారు. పోలీసు అధికారులపైకి బాటిళ్లు, ఫైర్ వర్క్స్ రువ్వుతూ దుకాణాలను లూటీ చేస్తూ పోతున్నారు. వేసవిలో 2012 కామన్‌వెల్త్ క్రీడలు జరుగనున్న నేపథ్యంలో ఈ అల్లర్లు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

కామెంట్‌లు

  1. 1980 లో ఇలా అల్లర్లు జరిగినట్లు తెలియదు. చిన్న సవరణ అండి. 2012 లో లండన్ లో ఒలంపిక్ ఆటలు - జరగబోతున్నాయి.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!