హైదరాబాదులో బాంబ్ బ్లాస్ట్..?
ఈ ప్రశ్నలు ప్రస్తుతం పోలీసులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే హైదరాబాదు నగరంలో మరోసారి పోలీసులు భారీ పేలుడు పదార్థాలు గుర్తించారు. సుమారు 870 జిలెటిన్ స్టిక్స్, 1900 వరకు డిటోనేటర్లు గుర్తించారు. వీటిని నార్త్ జోన్ పోలీసులు గురువారం గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ కలిగి ఉన్న ఏడుగురు నిందితులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. కారు, ఓ ద్విచక్ర వాహనం, రూ.25 వేలు సీజ్ చేశారు. పోలీసీలు వారిని విచారిస్తున్నారు. నిందితులు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాదు పోలీసులు కంచన్‌బాగ్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సంబరాల దృష్ట్యా ఎలాంటి ప్రమాదం జరగకుండా నగరంలో పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈ నెల 20వ తేది వరకు హై అలెర్టు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నగర పౌరులు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉగ్రవాదుల డేగకన్ను ముంబయి తర్వాత ఎక్కువగా హైదరాబాద్ నగరంపైనే ఉంటూ వస్తూంది. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రాణహాని తలపెట్టడానికి సిద్దపడుతున్నారు. అలాంటి వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే నగరపౌరులు ఎంతో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. మీ చుట్టు పక్కలో ఎవరైనా అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకి సమాచారం అందించండి.. అలాగే మీ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వాహనాలు, వస్తువులు, టిఫిన్ బాక్సులు, సూట్‌కేసులు లాంటివి గుర్తించినట్టయితే వెంటనే పోలీసులకి తెలపండి.. దీంతో మీ ప్రాణాలతో పాటు మీ చుట్టూ ఉన్నవారిని కూడా రక్షించిన వారవుతారు.. సో.. బీ అలర్ట్ ఎవ్రిబడీ.. ఫ్రం నౌ ఆన్ వార్డ్స్..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి