జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేసెన్‌..


రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ ఆస్తుల‌పై జ‌రుగుతున్న కేసుల‌పై ఉత్కంఠ నెల‌కొన్న ఈ ప‌రిస్థితిలో వైఎస్‌. జ‌గ‌న్  పార్ల‌మెం టులో ఎం.పి.గా ప్ర‌మాణ స్వీకారం చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున మొద‌టి ఎం.పి.గా జ‌గ‌న్ పార్ల‌మెంటులోకి అడుగుపెట్ట‌డం విశేషం.  గురు వారంనాడు ఆయన లోక్ సభకు హాజరై ప్రమాణం చేసినప్పుడు సభ్యలు బల్లలు చరిచారు. జగన్ తెలుగులో ప్రమాణం చేశారు. ఆయన దైవసాక్షి గా ప్రమాణస్వీకారం చేశారు. జగన్ ప్రతిష్టాత్మంగా కడప ఉప ఎన్నికలో పోరాడి గెలుపొందారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణా మాలలో జగన్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి , పార్లమెంటు సభ్యత్వం నుంచి కూడ వైదొలగారు. తదుపరి జరి గిన ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో ప్రత్యర్ధి పార్టీలకు డిపాజిట్ పోగొట్టి మరీ గెలిచారు. జగన్ వెంట ఎమ్.పి లు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు కూడా లోక్ షభకు వెళ్లారు.జగన్ ను స్పీకర్, పలువురు సభ్యలు అభినందించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!