వై.ఎస్.క్యాబినెట్ మంత్రులపై కేసులు ఏవి?
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్ ఏవైనా తప్పు నిర్ణయాలు చేసిందనుకుంటే, అందులో మంత్రు లకు భాగస్వామ్యం ఉండదా అని జగన్ తరపు న్యాయవాది తులసి వాదించారు. జగన్ ఆస్తుల కేసును హైకోర్టు విచా రిస్తున్న సంగతి తెలిపిందే. హైకోర్టుకు డాక్టర్ పి.శంకరరావు ఎమ్మెల్యేగా ఉన్న ప్పుడు లేఖ రాశారని, అందులో జగన్ పేరు ప్రస్తావించలేదని, ఆ తర్వాత బేరమాడుకుని జగన్ పేరును ఇరి కించారని ఆయన ఆరోపించారు. శంకరరావు రాసిన లేఖకు సంబంధించి ఒక ఆధారమైన ఆయన సమర్పిం చారా అని న్యాయవాది ప్రశ్నించారు.కేవలం రాజకీయ కక్షతోనే ఈ అభియోగాలు మోపారని , అలాంటప్పుడు వై.ఎస్. క్యాబినెట్ లో ఉన్నమంత్రులపై కూడా ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి