ఐసియు లో రాష్ట్ర ప్రభుత్వం


రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ఎంపీ తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రన్నాయుడు ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళిక నిధులు మళ్లింపు జరుగుతుందని.. ఇది అన్యాయం అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కుర్చీకే ప్రధాన్యం ఇస్తున్నారని.. పథకాల అమలులో ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని.. సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఎర్రన్నా యుడు చెప్పుకొచ్చారు. ఆరోగ్యశ్రీ పై డీఎల్ వ్యాఖ్యలు చూస్తుంటే.. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ద పాలన సాగడం లేదని అనిపిస్తోందని ఎర్రన్నాయుడు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం కోమాలో ఉందన్నారు. ఇక 14 ఎఫ్ పై ఇప్పటికే అసెంబ్లీ ఓ సారి తీర్మానం చేసిందని.. మళ్లీ కావాలంటే అది చట్ట సభలను అగౌరవపర్చడమే అని ఎర్రన్నాయుడు చెప్పుకొచ్చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!