అవ‌కాశాలు ఉన్నాయి.. టైం లేదు..!


అని అంటోంది శృతి హాస‌న్‌. క‌మ‌ల్‌హాస‌న్ కూతురు శృతి హాస‌న్ త‌న తండ్రిలాగే మ‌ల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసిన శృతికి అక్కడ అదృష్టం కలిసిరాకపోవడంతో సంగీత దర్శకురాలిగా తండ్రి కమల్‌ హాసన్ నటించిన ‘ఈనాడు’ సినిమాకు పనిచేసింది. ఇది కూడా అంతగా పేరు తీసుకురాలేదు. దీంతో మళ్లీ హీరోయిన్‌గా ప్రయత్నాలు ప్రారంభించింది. తెలుగులో అన‌గ‌న‌గా ఓ ధీరుడు ద్వారా కూడా హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ప్ర‌స్తుతం తెలుగులో ‘ఓ మై ఫ్రెండ్’, ఎన్టీఆర్‌తో బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ నటిస్తోంది. అంతేకాదు త‌మిళంలో సూర్య సరసన ‘ఏళావు అరివు’ చిత్రంలోనూ న‌టిస్తోంది. వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగా మారిపోయిన శృతికి కొన్ని మంచి ప్రాజెక్టుల‌ని వ‌దులుకోవాల్సి వ‌స్తోంద‌ని బాధ‌ప‌డుతోంది. త‌మిళంలో ధ‌నుష్ హీరోగా రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహి స్తున్న సినిమా సినిమాని కూడా వ‌దులుకుంది. అయితే అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని విశ్రాంతి లేకుండా ప‌నిచేస్తే ఆరోగ్యం పాడ‌యిపోతుంద‌ని అందుకే వ‌దులుకున్నాన‌ని చెబుతోంది. నిజ‌మే క‌దా.. ఆరోగ్యం స‌రిగా లేకుంటే అవ‌కాశాలెన్ని వ‌చ్చినా ఏం లాభం.. అందుకే ఉన్న‌వాటినైనా చ‌క్క‌గా చేసుకుంటూ పోవాల‌న్న శృతి డిసిష‌న్ బాగానే ఉంది క‌దూ..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!