హీందీలోనూ 100 పర్సంట్ లవ్..
నాగచైతన్య, తమన్నా హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం 100 పర్సంట్ లవ్. ఈ చిత్రం విడుదలయి విజయవంతంగా ప్రదర్శిస్తుండడం తెలిసింది.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పనలో వచ్చిన ఈ చిత్రం త్వరలో హిందీలో రీమేక్ కాబోతోంది. ఈ మధ్య బాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలు తెలుగు సినిమా విడుదలయిందంటే చాలు.. వెంటనే దాన్ని రీమేక్ చేసి పారేయాలని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. ఇలా రీమేక చేసి సక్సెస్ సాధించిన హీరోల్లో సల్మాన్ ఖాన్ ముందుంటాడు. ఆయన తెలుగు పోకిరీ చిత్రాన్ని హిందీలో వాంటెడ్ గా రీమేక్ చేసి గొప్ప సక్సెస్ సాధించాడు.. ఇప్పుడు తాజాగా తెలుగులో రామ్, ఇలియానా నటించిన రెఢీ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసి మరో సక్సెస్ అందుకోబోతున్నాడు.. ఇప్పుడు ఇదే కోవలో 100 పర్సంట్ లవ్ కూడా చేరబోతోంది. ఈ చిత్రానికి తెలుగులో దర్శకత్వం వహించిన సుకుమారే దర్శకుడిగా ఉండబోతున్నాడని త్వరలోనే మిగతా నటీనటుల వివరాలు తెలుస్తాయని అంటున్నారు.. సో.. బాలీవుడ్‌లో కూడా 100 పర్సట్ లవ్వే నన్న మాట..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి