అజాద్ తక్కువ మాట్లాడింది ఎవరితో
కేంద్ర మంత్రి , రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ గులాం నబీ అజాద్ రెండు రోజుల పర్యటనలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన చాలామందితో మాట్లాడారు. తెలంగాణ అంశంపైన, అలాగే ముఖ్యమంత్రి పనితీరు. రాష్ట్రంలోపార్టీ వ్యవహారాలు, జగన్ ఇష్యూ .. ఇలా అందరితో అన్నీ మాట్లాడారు.కొందరితో ఎక్కువ సేపు కూడా మాట్లాడారు.కాని అందరికన్నా తక్కువ మాట్లాడింది ఎవరితోనో తెలుసా? అది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో . సోమవారం నాడు కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే కిరణ్ తో అజాద్ సంభాషించారు.అజాద్ ను కలవడానికి లేక్ వ్యూకి వచ్చినా ఎక్కువ సేపు కలవడానికి కుదరలేదు. జూబ్లి హాల్ లో ఏర్పాటు చేసిన విందులో కూడా కేవలం ఐదు నిమిషాలే ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఆ తర్వాత ఇతర ప్రముఖులతో చర్చించడానికే అజాద్ ఇష్టపడ్డారు. మంగళవారం నాడు ముఖ్యమంత్రి సంగారెడ్డి కూడా వెళ్లి వచ్చారు. ఉదయం నుంచి రాత్రి ఏడున్నర , ఎనిమిది గంటలవరకు ఆయన ఆయా ప్రతినిది బృందాలతోను, వ్యక్తులతోను మాట్లాడారు. అనేక అంశాలపై అబిప్రాయ సేకరణ జరిపారు. ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రికి ఈ విషయాలతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహారాలు నడిచిపోతున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రితో ఎప్పుడైనా సంభాషించవచ్చని, అంతేకాక పలువురు సి.ఎమ్.పైనే ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉండడం కూడా సరికాదని అంటున్నారు. అయితే ప్రత్యేకంగా సి.ఎమ్ తో అజాద్ సమావేశం కాకపోవడాన్ని ఆసక్తికరంగా గమనిస్తున్నారు. దీని అర్ధం ఏమిటా అని చర్చించుకుంటున్నారు
ముఖ్యమంత్రిపై అంసతృప్తా? లేక అభిప్రాయ సేకరణలో ఆయనకు ప్రమేయం లేకుండా చేసి, ఆ తర్వాత వాటి ప్రకారం తగు సలహాలు ఇవ్వడమా అన్నది తేలాలంటే మరికొంత కాలం గడవాల్సిందే.
ముఖ్యమంత్రిపై అంసతృప్తా? లేక అభిప్రాయ సేకరణలో ఆయనకు ప్రమేయం లేకుండా చేసి, ఆ తర్వాత వాటి ప్రకారం తగు సలహాలు ఇవ్వడమా అన్నది తేలాలంటే మరికొంత కాలం గడవాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి