మొద‌టిసారి యాష్‌, రెహ‌మాన్‌ల కాంబినేష‌న్‌..


ఎ.ఆర్‌. రెహ‌మాన్.. రెండు ఆస్కార్ అవార్డుల‌ని అందుకున్న ఏకైక భార‌తీయుడు. ఆయ‌న బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ల‌లోనే కాకుండా ఇంగ్లీష్ చిత్రాల‌కి కూడా మ్యూజిక్‌ని అందించి ప‌లువురి ప్ర‌శంస‌లందుకున్నాడు. స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ చిత్రానికి సంగీతాన్ని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని అందించినందుకు ఆయ‌న‌కి రెండు ఆస్కార్ అవార్డులు వ‌రించాయి. ఇయ యాష్‌చోప్రా.. ప్రేమ క‌థా చిత్రాల‌ని తెర‌కెక్కించ‌డంలో ఆయ‌న అందెవేసిన చెయ్యి.. ప్రేమ‌లోని మాధుర్యాన్ని ప్రేక్ష‌కులు పూర్తిగా ఆస్వాదించేలా తీయ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌.. అందుకే ఆయ‌న తీసిని దిల్వాలే దుల్షానియా లేజాయేంగే చిత్రం ఏకంగా ప‌ది సంవ‌త్స‌రాల పాటు ఒకే థియేట‌ర్‌లో న‌డిచి రికార్డు సృష్టించింది. అలాంటి యాష్‌చోప్రా, ఎ.ఆర్‌. రెహ‌మాన్ క‌ల‌యిక‌లో మొద‌టిసారి ఓ చిత్రం రాబోతోందంటే.. ఆ చిత్రంపై ఎన్ని ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయో చెప్ప‌క్క‌ర్లేదు.. అంతేకాదు.. ఈ చిత్రంలో హీరోగా షారుఖ్‌ఖాన్ న‌టిస్తున్నారు. షారుఖ్‌, రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో చ‌క్క‌ని హిట్ ఫిలింస్ రావ‌డం తెలిసిందే.. మ‌రి ఈ ముగ్గురు యోధుల క‌ల‌యిక‌లో వ‌స్తున్న కొత్త చిత్రం ఎన్ని సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తుందో వేచి చూడాలి…

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!