పోకిరికి సీక్వెల్‌లో మ‌హేష్‌బాబు..?


మ‌హేష్‌, పూరి జ‌గ‌న్నాథ్ ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పోకిరి చిత్రం తెలుగు సినిమా చ‌రిత్ర‌నే తిర‌గ‌రాసింద‌న్న‌ది తెలిసిందే.. ఆ చిత్రం త‌ర్వాత అటు మ‌హేష్‌బాబుకి, ఇటు పూరీ జ‌గ‌న్నాథ్‌ల‌కి ఒక్క హిట్ కూడా ద‌క్క‌లేదు. అయితే మ‌హేష్‌బాబు పోకిరి సీక్వెల్‌లో న‌టిస్తున్నార‌ని ఒక రూమ‌ర్ వెలుగులోకి వ‌చ్చింది. ఇంత‌కీ విష‌య‌మేమిటంటే.. నిన్న సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మ‌హేష్ తాజా చిత్రం దూకుడు ట్రైల‌ర్‌ని విదడుద‌ల చేసారు. ఈ ట్రైల‌ర్ చూసిన వారంతా ఇదేదో పోకిరికి సీక్వెల్ ఉందే అని క‌న్ఫ‌ర్మ్ అవుతున్నార‌ట‌. అయితే ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల‌. శ్రీ‌నువైట్ల త‌న‌దైన మార్కు కామెడీతో యాక్ష‌న్‌, ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాడ‌ని చెబుతున్న‌ప్ప‌టికి, ట్రైల‌ర్‌లో వ‌చ్చిన ఒక డైలాగు మాత్రం పోకిరి చిత్రంలో పాపుల‌ర్ అయిన డైలాగ్‌లా ఉండ‌డంతో ఈ రూమ‌రం వ‌చ్చింది. అంతేకాదు స‌ద‌రు ఓ ఛాన‌ల్ వాళ్ళు ఈ విష‌యం మీద ఏకంగా ఓ ప్రోగ్రాంనే చేసేసారు. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ మ‌హేష్‌, శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్‌లో వస్తున్న ఈ చిత్రం శ్రీనువైట్ల మార్కు కామెడీతో, మ‌హేష్ మార్కు యాక్ష‌న్ తో అల‌రించ‌నుంద‌న్న‌ది ఇండ‌స్ట్రీ టాక్‌.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!