నమస్తే తెలంగాణకు ముద్రవేస్తారా..?


నమస్తే తెలంగాణ పత్రిక టీఆర్ఎస్ పత్రికని లేదా కేసీఆర్ పత్రికని ముద్ర వేసి పుట్టకముందే శిశువును చంపే ప్రయత్నం చేస్తున్నారని నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకులు అల్లం నారాయణ ఆరోపించారు. నమస్తే తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రసం గించారు. నమస్తే తెలంగాణ శిశువును ఎలా ఎత్తుకుంటారో.. ఎలా కాపాడుకుంటారో అన్నది మీ అందరిమీదా ఉందంటూ.. తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను ఉద్దేశించి అన్నారు. ఏమీ.. మీకు రాజకీయాలు లేవా.. ఎవరికోసమో పత్రికలు నడవడం లేదా.. చంద్రబాబు, జగన్‌ల కోసం పత్రికలు నడవడం లేదా.. అయినా మీకు లేని ముద్ర మాకెందుకు వేస్తున్నారు. కేసీఆర్ పత్రిక పెట్టవచ్చు కానీ అదెలాగ నడుస్తుందో చూడండి. కోట్లాది మంది దుఃఖితులు, బాధితుల గురించి పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాల తరపున, ఆ వర్గాల ముద్దుబిడ్డల కోసం పనిచేస్తుందని నేను ప్రకటిస్తున్నా అంటూ సంపాదకుడి హోదాలు అల్లం నారాయణ ప్రకటించారు. ఇకపై కుట్రలు, కుతంత్రాలు చెల్లవని,.. 15 లక్షల కాపీలను అమ్ముతున్న పత్రికలు ఈ ప్రాంతం గురించి రాయడం లేదని.. చరిత్రను సాఫ్‌ చేయడం కోసం ఈ పత్రిక వస్తుందని నారాయణ చెప్పారు. ధిక్కార స్వరాన్ని వినిపించడానికి, అబద్ధాలను బద్దలు కొట్టడానికి పాఠకులు కానీ అన్నార్తులు, దిక్కులేనివాళ్ల కోసం పత్రిక పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇకపై తెలంగాణ జర్నలిస్టులకు ఇవాళ్టి నుంచి స్వేచ్ఛ దొరికిందని చెప్పిన ఆయన.. నమస్తే తెలంగాణ పత్రిక రెండు లక్ష్యాలతో నడుస్తుందన్నారు. తెలంగాణ కోసం ప్రస్తుతం నడుస్తున్న ఉద్యమాన్ని నెత్తికెత్తుకోవడం, తెలంగాణ ఏర్పడ్డాక ప్రత్యేక రాష్ట్ర పునర్ణిర్మాణం కోసం పాటు పడటమే పత్రిక లక్ష్యమని చెప్పుకొచ్చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!