మంత్రివర్గంలోనుండి నన్నుకూడా తీసేయండి..!
రాష్ట్ర చేనేత శాఖ మంత్రి డాక్టర్ పి.శంకరరావు మరో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర మంత్రి వర్గాన్నిపూర్తిగా పునర్వ్యవస్థీక రించాలని ఆయన డిమాండు చేశారు. మంత్రివర్గంలో అనేకమంది అవినీతి అభియోగాలు వస్తున్నా యని, వారందరని తొలగించాలని ఆయన సూచిం చారు. తనపై కూడా ఏవైనా ఆరోపణలు ఉంటే వాటిని విచారించి తనను కూడా తొలగించవచ్చని ఆయన అన్నారు. శంకరరావు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో కాని ఇటీవలి కాలంలో మంత్రివర్గ క్షాళన జరుగుతుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే శంకరరావు కు కూడా మంత్రి పదవి అనుమానమేనని ప్రచారం జరుగుతోంది. బహుశా ఆ అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం ముందర కాళ్ల బంధం వేయడానికి కూడా ఆయన ఈ మాటలు చెప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రకటన చేయడం ద్వారా శంకరరావు అనుకూలంగానో,ప్రతికూలంగానో వార్తలలో ఉంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి