టీడీపి నోరు పడిపోయిందా?
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టంగా బయట పడిందని టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు . శనివారం శాసనసభలో తెలుగుదేశం వ్యవహరించిన తీరు మ్యాచ్ ఫిక్సింగ్ కి ఊతమిస్తోంది అని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే విషయంలో తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిపై రాజకీయ వర్గాల్లో మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పార్టీల నేతల సందేహాలివి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు ఆ పార్టీ వ్యవహార శైలి బలాన్ని చేకూరుస్తోంది.అవిశ్వాస తీర్మానం పెట్టె విషయంలో రోజు ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన నేతలు శనివారం సభలో కనీసం మాటవరసకైనా ఆ ప్రస్తావన తేలేదు. చిన్నఅంశం పైనే సభను రోజుల తరబడి స్తంభింప చేసిన టీడీపీ ఉదయం పదకొండు గంటల నుంచి సభ నిరవధికంగా వాయిదా పడేంత వరకు అవిశ్వాస తీర్మానం నోటీసు గురించి నోరు మెదపలేదు. నోటీసు ఇచ్చిన వారికీ దాని గురించి ప్రస్తావించాలని తెలియదా ? ప్రస్తావించక పోతే అది చెల్లదని తెలిదా ? అవిశ్వాసం గురించి సభలో మాట్లాడని చంద్రబాబు , సభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు . పదిరోజుల్లో అసెంబ్లీని సమావేశపరచి తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. టిడిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై బల నిరూపణ చేసుకోవలసింది ముఖ్యమంత్రి కిరణ్ కాగా, చంద్రబాబు మాత్రం గవర్నర్ ఎదుట బలం నిరూపించుకోవాలని జగన్‌ను డిమాండ్ చేయడం విచిత్రం. మా సందేహాలన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ నే దృవపరుస్తున్నాయి ఈ ప్రశ్నలు అన్నిటికి టీడీపీ యే జవాబు చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి