రౌడీ రాథోడ్ బూతు సినిమానా..?


ఇప్పుడు బాలీవుడ్ చూపు ద‌క్షిణాది చిత్రాలపైనే ఉంది. కోలీవుడ్‌, టాలీవుడ్ భాష‌ల్లో వ‌స్తున్న చిత్రాల‌ని ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ స్పెష‌ల్‌గా గ‌మ‌నిస్తున్నారు. ఇక్క‌డ విజ‌యాలు సాధించిన చిత్రాల‌ని ఏమాత్రం ఆలస్యం చేయ‌కుండా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇలా రీమేక్ చేసిన చిత్రాలు కూడా బాలీవుడ్‌లోఘ‌న విజ‌యాల‌నే సాధించాయి. అమీర్‌ఖాన్ గ‌జిని, స‌ల్మాన్‌ఖాన్ వాంటెడ్ చిత్రాల‌తో ఘ‌న విజ‌యాలని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాలు రెండూ తెలుగుకి రీమేకే అని తెలిసిందే.. తాజాగా తెలుగులో వ‌చ్చి ఘ‌న‌విజ‌యం సాధించిన‌ విక్ర‌మార్కుడు చిత్రాన్ని హిందీలో అక్ష‌య్‌కుమార్ హీరోగా రీమేక్ అవుతోంది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవా.  అయితే విక్ర‌మార్కుడు చిత్రాన్ని బూతు చిత్రంగా అభివ‌ర్ణిస్తోంది బాలీవుడ్ మీడియా.. తెలుగు వ‌చ్చిన విక్ర‌మార్కుడులో కొన్నిస‌న్నివేశాలు అశ్లీల‌క‌రంగా ఉన్నాయ‌ని, అదొక బూతు చిత్ర‌మ‌ని ఆ బూతు చిత్రంలో అక్ష‌య్‌కుమార్ న‌టిస్తున్నాడ‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మ‌రి.. దీనికి అక్ష‌య్‌కుమార్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ చిత్రానికి రౌడీ రాథోడ్ అనే టైటిల్‌ని పెట్టాల‌ని అనుకుంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!