చిన్న పార్టీలతో చిక్కులే – 1
పేరుగొప్పఊరుదిబ్బ అన్నట్టుగా ఉంది జాతీయ స్థాయి పార్టీల తీరుతెన్ను. సంకీర్ణాల యుగం సాగుతుండటంతో చిన్నాచితకపార్టీల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక పెద్ద పార్టీలు సతమతమవుతున్నాయి. ఒకప్పుడు జాతీయ పార్టీలంటే దేశ ప్రజల ప్రయోజనాలకు కాపలాదారులుగా వ్యవహరించేవి. కానీ ఇప్పుడా పరిస్థితిలేదు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకుండా చీటికీ మాటికీ అడ్డుతగులుతున్నవి చిన్న పార్టీలే. ఈ విపరీత పరిస్థితిని పెద్దపార్టీలు చక్కదిద్దలేకపోతున్నాయి. ఇందుకు కారణాలేమిటో ఓసారి చూద్దాం.
దేశ రాజకీయాలను జాతీయ స్థాయి పార్టీలు శాసిస్తున్నాయనుకుంటే పొరపాటే. అటు కాంగ్రెస్ పార్టీకిగానీ, ఇటు భారతీయ జనాతాపార్టీకిగానీ దిశానిర్దేశం చేసే శక్తి తగ్గిపోతోంది. ప్రస్తుతం జరుగుతోన్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలు చూస్తుంటే ఇది నిజమనిపించకమానదు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభైనప్పటి నుంచీ జాతీయ పార్టీలకంటే, చిన్నపార్టీల హవానే నడుస్తోంది. చిన్నపార్టీల శక్తిని తక్కువగా అంచనావేయడానికి వీల్లేదు. ఇవి తమకు ఇష్టమైతే సభను సజావుగానడిపించగలవు, లేదంటే గందరగోళం సృష్టించనూగలవు. దీంతో జాతీయ పార్టీల పరిస్థితి ఇరకాటంలో పడింది.
స్వాతంత్ర్యానంతరం దేశంలో కొద్దికాలం జాతీయ పార్టీల హవా నడిచింది. సిద్ధాంతపరంగా తేడాలు ఉంటేఉండవచ్చేమోకానీ, జాతీయతాభావం పెంపొందించడంలో ఈ పార్టీలు కీలక పాత్రనే పోషించాయి. జాతి ప్రయోజనాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాతీయ స్థాయి పార్టీలు హుందాగా వ్యవహరించేవి. అభ్యంతరాలు వ్యక్తం చేసినా సభాకార్యక్రమాలకు విఘాతం కలిగించేస్థాయిలో ఉండేవికావు. దీంతో అనేక కీలక చట్టాల రూపకల్పనకు వీలుచిక్కేది. రాజ్యాంగ సవరణ బిల్లులు కూడా అనేకం చట్టసభల్లో ఆమోదంపొందాయి.
రోజులు మారాయి. ఇప్పుడు అత్యంత కీలకమైన అంశాలనే సభలో ప్రస్తావిస్తామంటూ అధికార పార్టీ చెబుతున్నా, విపక్షాలు సభను సజావుగా సాగనివ్వడంలేదు. అయితే, ఇందులో ఎవరిది తప్పు? ఎందుకీ పరిస్థితి తలెత్తింది ?
విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం వెలికితీతకు సంబంధించి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టే విషయంలో ఎన్డీయే సారధి ఎల్.కె.అద్వానీకి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూ ఒక అవగాహన కూడా కూదిరిందనే చెపుతున్నారు. నల్లడబ్బు అంశంతోనే అద్వానీ ఈ మధ్య దేశవ్యాప్తంగా రథయాత్ర చేశారు. అందుకే బీజేపీ ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా పొలిటకల్ మైలేజ్ సంపాదించుకోవాలని చూస్తోంది. ఎవరిఎడ్వాంటేజ్ వారు చూసుకుంటున్న నేపథ్యంలో సైతం, జాతీయ పార్టీలు హుందాగానే వ్యవహరిస్తున్నాయి. సమస్య తెగేదాకా లాగకుండా అద్వానీ చేతనే వాయిదా తీర్మానం ప్రవేశపెట్టించే విషయంలో కాంగ్రెస్ కూడా సానుకూలత వ్యక్తం చేసింది. అయినప్పటికీ, పార్లమెంట్ సమావేశాల్లో బ్లాక్ మనీ విషయం ప్రస్తావనకు ఎందుకు రాలేదు?
చిన్నపార్టీల సభ్యులు లేవనత్తే అంశాలు కూడా ముఖ్యమైనవే. అయితే, సభాకార్యక్రమాలు సాఫీగా జరిగితే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. ఉదాహరణకు ధరల పెరుగుదల విషయంపై కమ్యూనిస్ట్ పార్టీల సభ్యులు నిరసన వ్యక్తం చేసినా సభను స్తంభింపచేయాలనుకోలేదు. కానీ మరో వైపు చిన్నపార్టీలు మాత్రం సభను స్తంభింపచేయడంలో సిద్ధహస్తులైపోయాయి.

చిన్న పార్టీల దూకుడు – కారణాలు
ప్రజాస్వామ్య దేశంలో అన్ని పార్టీలు సమానమే. ఇది పెద్దపార్టీ, లేదా అది చిన్నపార్టీలంటూ తేడాలుండవు. అయితే, చిన్నపార్టీల సంకుచితత్వ ధోరణే ప్రమాదకరంగా మారిపోవచ్చు. ఇదే ప్రజాస్వామ్య ప్రియులను కలవరపరుస్తోన్న విషయం. మరి ఈక్లిష్టపరిస్థితి ఎలా చక్కదిద్దాలి?

చక్కదిద్దే పద్ధతులు
చిన్న పార్టీల్లో జాతీయతాభావం పెంచాలి
అలాంటి పార్టీలనే కూటమిలో చేర్చుకోవాలి
జాతీయ పార్టీల మధ్య అవగాహన అవసరమే
జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కీలకమైన అంశాల విషయంలోనైనా సన్నిహితంగా మెలగాలి. కలిసి సమస్యపరిష్కారానికి కృషిచేయాలి.

- తుర్లపాటి నాగభూషణ రావు
(ఇంకావుంది)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి