చిల్లర రాజకీయాలు జగన్‌వే : బొత్స
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌వే చిల్లర రాజకీయాలని ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. జగన్ చేసిన విమర్శలపై ఆయన మంగళవారం తీవ్రంగా ప్రతిస్పందించారు. జగన్ నుంచి తాము రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎవరు ఎవరిని ప్రలోభపెట్టారో రేపు మీడియాకు వెల్లడిస్తానని ఆయన చెప్పారు. తాము డబ్బులిచ్చి శాసనసభ్యులను ప్రలోభ పెట్టినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. విప్ ధిక్కరించిన శాసనసభ్యుల విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చూసుకుంటారని ఆయన అన్నారు.
తమకు జగన్ సలహాలు అవసరం లేదని ఆయన అన్నారు. ఎవరి మీద ఎప్పుడు వేటు వేయాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. శాసనసభ్యులను తాము ప్రలోభ పెట్టలేదని, వైయస్ జగనే ప్రలోభపెట్టారని ఆయన అన్నారు. ఎవరు ఏ పార్టీ ఉన్నారో అవిశ్వాస తీర్మానం వల్ల తేలిపోయిందని ఆయన అంతకు ముందు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం మంత్రులకు, నాయకులకు, శాసనసభ్యులకు విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ విందుకు బొత్స సత్యనారాయణ, చిరంజీవి, మంత్రులు, శాసనసభ్యులు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి, శాసనసభలో బలం నిరూపించుకున్నందుకు వారంతా ముఖ్యమంత్రిని అభినందించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి