వీగిన అవిశ్వాసం
అర్ధరాత్రి అవిశ్వాసంలో అసలు విషయం తేలిపోయింది. ఎవరి బలం ఎంతో స్పష్టమైంది. ‘ఫలితం తెలిసిన పరీక్ష’లో అధికార పక్షమే గెలిచింది. ఓడిపోయింది మాత్రం ప్రధాన ప్రతిపక్షం కాదు! ఈ ఓటమి… జగన్ పార్టీది! సర్కారును పడగొడతామంటూ పలుమార్లు తొడగొట్టి సవాల్ విసిరిన జగన్ పార్టీకి పరాభవం ఎదురైంది. అసెంబ్లీలో ఆయన బలం 18 మాత్రమే అని తేలిపోయింది. వీరిలో 16 మంది అధికార కాంగ్రెస్ సభ్యులు. శోభా నాగిరెడ్డి (పీఆర్పీ) జగన్ మాట ప్రకారం అవిశ్వాసాన్ని బలపరిచారు.
ఇక.. టీడీపీ సభ్యుడు బాల నాగిరెడ్డి జగన్ పక్షాన ఉన్నప్పటికీ, విప్ అవిశ్వాసానికి మద్దతు పలకడంతో ఆయన టీడీపీ కోటాలోకి వచ్చినట్టయింది. ‘అవిశ్వాసానికి మద్దతు ప్రకటించే వారు లేచి నిలబడండి’ అని స్పీకర్ ఆదేశించగానే… టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ సభ్యులు లేచి నిలబడ్డారు. అయితే… అందరి దృష్టి జగన్ వర్గం మీదే పడింది. ఆయన ఎమ్మెల్యేల్లో ఎవరెవరు నిలబడ్డారంటూ అంతా అటువైపే చూశారు. ఆయన వర్గంలో వైఎస్ విజయతో సహా 18 మంది లెక్క తేలారు.
ఓటింగ్‌కంటే ముందే జగన్ వర్గంలోని పూతలపట్టు రవి సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో… కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో జగన్ పక్షాన నిలిచింది 16 మందేనని స్పష్టమైంది. పీఆర్పీ విప్‌ను ధిక్కరిస్తూ శోభా నాగిరెడ్డి కూడా జగన్‌కే జై కొట్టారు. దీంతో… ఈ 17 మందిపై అనర్హత వేటు పడే అవకాశం ఏర్పడింది. ఓటు వేయకుండా వెళ్లిపోయినా పూతలపట్టు రవిపైనా చర్యలు తీసుకుంటారా? అనేది కాంగ్రెస్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
కాంగ్రెస్ విప్ జారీ చేసిన ఇండిపెండెంట్ సోమారపు సత్యనారాయణ కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ విప్ తనకు వర్తించదని ఆయన ముందే పేర్కొన్నారు. ఓటింగ్‌లో 282 మంది పాల్గొనగా… అవిశ్వాసానికి వ్యతిరేకంగా 160 ఓట్లు పడ్డాయి. మద్దతుగా 122 ఓట్లు మాత్రం వచ్చాయి. దీంతో… ప్రభుత్వం 38 ఓట్ల తేడాతో సర్కారు విజయం సాధించింది. జగన్ బలం కూడా తేలిపోయింది.
అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 294. ఇందులో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చెన్నమనేని రమేశ్ (టీఆర్ఎస్), ముంతాజ్ అహ్మద్ ఖాన్ సభకు హాజరు కాలేదు. టీడీపీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ సాంకేతిక కారణాల వల్ల ఓటు హక్కుకు దూరమయ్యారు. పూతలపట్టు రవి ఓటింగ్ సమయంలో బయటికి వెళ్లిపోయారు. తటస్థంగా ఉంటానని ప్రకటించిన లోక్‌సత్తా జయప్రకాశ్ కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. సోమవారం ఉదయం 9 గంటలకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగంతో మొదలైన చర్చ… అర్ధరాత్రి దాటాక ఆయన ప్రసంగంతోనే ముగిసింది.
సుమారు 16 గంటలపాటు జరిగిన చర్చలో ‘నాలుగు కోణాల్లో’ యుద్ధం జరిగింది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్… ఒకరినొకరు ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ఒకరి ఆరోపణలకు మరొకరు దీటుగా బదులిచ్చారు. అవిశ్వాస తీర్మానంలో ప్రధానాంశమైన రైతుల సమస్యపై చర్చ జరిగింది కొంతే! తెలంగాణ, అవినీతి, విశ్వసనీయత, కేసులు తదితర అంశాలపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తొలిసారి శాసన సభలో అడుగుపెట్టిన వైఎస్ విజయ… తొలిసారిగా అసెంబ్లీ వేదికపై మాట్లాడారు. భావోద్వేగం ప్రసంగించారు. అటు కాంగ్రెస్‌కు, ఇటు టీడీపీకి చురకలు అంటించేందుకు ప్రయత్నించారు. ఆమె ఆరోపణలను, వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ బలంగా తిప్పికొట్టారు. టీడీపీ తరఫున సీతక్క దీటుగా స్పందించారు.

వేటు తథ్యం..
అవిశ్వాసాన్ని బలపరిచి, జగన్ పక్షాన నిలిచిన అధికార పక్ష సభ్యులపై వేటు వేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ‘తీర్మానానికి సానుకూలంగా స్పందిస్తే కఠినంగా వ్యవహరిస్తాం’ అని సీఎం కిరణ్ ముందుగానే ప్రకటించారు. తోక జాడిస్తే కత్తిరిస్తామంటూ మంత్రుల వద్ద జరిగిన సమావేశంలోనూ వ్యాఖ్యానించారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను సోమవారం మధ్యాహ్నమే కలసి డివిజన్ కావాలని టీడీపీ సభ్యులు లిఖితపూర్వకంగా కోరారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ కూడా స్వాగతించింది. విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్, పీఆర్పీ మంగళవారం ఉదయం శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి