`నెట్’ స్వేచ్ఛకు దెబ్బ
`నెట్’ స్వేచ్ఛకు దెబ్బ
వెబ్ సైట్స్ లో ఇష్టమొచ్చినట్టు రాసే రోజులు పోయాయి. ఇంటర్నెట్ ఎడిషన్స్ లో ప్రముఖ వ్యక్తుల గురించి అశ్లీలంగా, పరువు దిగజార్చేలా రాతలు రాస్తే చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే కేంద్ర టెలికాం మంత్రి కపిల్ సిబాల్ ఇంటర్నెట్ కంపెనీల అధిపతులతో సమావేశమయ్యారు. వెబ్ సైట్స్ లో ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వంటివారిని కూడా కించపరుస్తూ వస్తున్న వెబ్ కంటెంట్ గురించి సిబల్ ఈ కంపెనీల అధిపతులతో చర్చించారు. సోషల్ నెట్ వర్క్ పేజీల్లో కూడా అమర్యాద పూర్వకమైన రాతలు కనబడుతున్నాయని మంత్రి వారి దృష్టికి తెచ్చారు. మొత్తానికి ఈ సమావేశంలో ఏదీ తేలకపోయినా భవిష్యత్తులో ఇంటర్నెట్ ఎడిషన్స్ పై కూడా కట్టుదిట్టమైన ఆంక్షలు పెట్టే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టే కనబడుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి