మారిష‌స్‌లో తెలుగు మ‌హా స‌భ‌లు


మారిషస్ తెలుగు కల్చరల్ సెంట్రల్ ట్రస్ట్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మారిషస్‌లోని ఇందిరాగాంధీ సెంట్రల్ ఫర్ ఇండియన్ కల్చర్‌లో ఈ నెల 8,9,10 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నట్లు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య కె. యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ తేదీ గురువారం ఉదయం 9గంటలకు మారిషస్ ప్రధానమంత్రి ఈ మహాసభను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ, మారిషస్ పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి దేవానంద్ లింగస్వామి, సాంస్కృతికశాఖ మంత్రి ముఖేశ్వరచూని, శాసన మండలి చైర్మన్ డాక్టర్ ఏ. చక్రపాణి, రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, వట్టి వసంత కుమార్, రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతోపాటు పద్మశ్రీ యార్ల గడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ ఎస్. చెల్లప్ప, మండలి బుద్ధప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొంటున్నట్లు వివరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!