హైదరాబాద్లో 144 సెక్షన్ అమలు


డిసెంబర్ 6వ తేదీ బ్లాక్ డే సందర్బంగా హైదరాబాద్ లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మంగళవారం బ్లాక్‌డే, మొహర్రం నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. కవ్వింపు, రెచ్చగొట్టే చర్యలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపడతామని నగర పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలు, సభలు అనుమతించబోమని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించే వారిపై కేసులు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలెవ్వరూ గుంపులుగా తిరగరాదని, ఒకేచోట చేరరాదని సూచించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!