జంతర్‌మంతర్‌లో హజారే దీక్ష
పటిష్టమైన లోక్‌పాల్ బిలును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ.. సామాజిక కార్యకర్త అన్నా హజారే న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను ప్రారంభించారు. మహారాష్ట్ర సదన్ నుంచి హజారే రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. లోక్‌పాల్ బిల్లుపై ప్రభుత్వంపై జంతర్‌మంతర్ వద్ద లోక్ వార్-3 ప్రారంభించడానికి ముందు రాజ్‌ఘాట్‌లోని బాపూజీ సమాధి వద్ద హజారే నివాళులర్పించారు. లోక్‌పాల్ మద్దతుగా పోరాటం సాగిస్తున్న నేతలు కిరణ్‌బేడి, కేజ్రీవాల్, మరికొందరు కార్యకర్తలు హజారే వెంట ఉన్నారు. జంతర్‌మంతర్ వద్ద లోక్‌పాల్ బిల్లుపై చర్చించేందుకు అన్ని పార్టీల నాయకుల్ని హజారే ఆహ్వానించారు. హజారేకు మద్దతుగా అన్నా బృంద సభ్యులు కూడా దీక్షలో పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు జంతర్‌మంతర్‌కు చేరుకుని అన్నాకు సంఘీభావం ప్రకటించారు. లోక్‌పాల్ బిల్లుపై చర్చించేందుకు అన్నిపార్టీల నేతల్ని హజారే ఆహ్వానించారు. ఈ చర్చలో బీజేపీ నేత అరుణ్ జైట్లీ, జేడీ నేత శరద్‌యాదవ్, సీపీఎం నేత బృందాకారత్, టీడీపీ తరపున ఎర్రంనాయుడులు పాల్గొననున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి