త‌మిళంలో డ‌బ్బింగ్ చెబుతున్న మ‌హేష్‌


మహేష్ బాబు తన తాజా చిత్రం ది బిజినెస్ మ్యాన్ తమిళంలోనూ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ తన వాయిస్ కు వేరే వారు డబ్బింగ్ చెప్పటం ఇష్టపడని మహేష్ తానే స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పుతున్నారు. ఎందుకంటే ఆయన చెన్నైలో చదువుకోవటం వల్ల తమిళం బాగా వచ్చు. ఇక తమిళ,తెలుగు వెర్షన్స్ రెండూ జనవరి 11,2012 నే విడుదల కానున్నాయి. ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. ‘బిజినెస్‌ మ్యాన్‌’గా టైటిల్‌కు తగిన పాత్ర అది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!