అవినీతిపై స‌మ‌ర‌మే..!


అవినీతిపై పోరాడేందకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ బుధవారం ఉదయం ఇక్కడ సమావేశమైంది. ఈ భేటీలో ఆమె మాట్లాడుతూ లోక్‌పాల్‌పై పార్టీ, ప్రభుత్వం మధ్య భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. ఆహార భద్రత, లోక్‌పాల్‌ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చిందన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాడినట్లుగానే లోక్‌పాల్‌ బిల్లు కోసం కూడా పోరాడుతామని సోనియా తెలిపారు.

కామెంట్‌లు