30 గంటల్లో అసెంబ్లీ పూర్తి
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల ఒకటి నుంచి వరుసగా ఐదు రోజుల్లో 30గంటల 20 నిమిషాలపాటు సాగాయి. మొత్తం 48 మంది ప్రసంగించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు నాలుగు ప్రకటనలను చేశారు. తొమ్మిది పాత బిల్లులతోపాటు, కొత్తగా ఏడు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టగా, తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి. కరువుపై స్వల్పకాలిక చర్చ జరగగా, రూల్స్ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. నక్షత్ర గుర్తు కలిగిన 30 ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి మౌఖిక సమాధానాలు లభించాయి. మరో 12 నక్షత్ర గుర్తు ప్రశ్నలు స్పీకర్ వద్దకు చేరగా, ఇంకో 28 ప్రశ్నలు నమోదయ్యాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి