ఎట్టకేలకు విండీస్ గెలుపు
చివరి వరకూ సాగిన ఉత్కంఠ పోరులో విండీస్‌నే విజయం వరించింది. మూడో వన్డేలో 16 పరుగులు తేడాతో విండీస్ విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది. రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఊపు మీద ఉన్న భారత్‌కు విండీస్ బ్రేక్ వేసింది.260 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్ 46.5 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ అత్యధికంగా 95 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అనవసరపు పరుగుకోసం యత్నించి మరో సెంచరీ కోల్పోయాడు.
105 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ చివరి వరకూ పోరాటం సాగించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. రోహిత్ శర్మ-అశ్విన్‌ల జోడి మరో 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం అభిమానులకు ఒకింత ఆశలు రేపింది. కాగా 31 పరుగులు చేసిన అశ్విన్ 40 ఓవర్లలో 7 వికెట్టు రూపంలో వెనుదిరిగాడు. అయినప్పటికీ ఆశలు మాత్రం ఇంకా రోహిత్ రూపంలో మిగిలే ఉండటంతో అభిమానులకు గెలుపుపై ధీమాను ఆసక్తిగా ఎదురు చూశారు. విజయం మాత్రం విండీస్ వైపే నిలిచింది. విండీస్ బౌలర్లలో రాంపాల్ నాలుగు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి