తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వమట..
పీఆర్పీ, ఎంఐఎం పార్టీలు తుమ్మితే రాష్ట్ర ప్రభుత్వం ఊడిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవిశ్వాసం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలం పెరగలేదని… తగ్గిపోయిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 144 నుంచి 136కు పడిపోయిందని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని అంబటి వ్యాఖ్యానించారు.
పదవులను తృణప్రాయంగా భావించి రైతు పక్షాన నిలిచి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన 18మంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రజలు హారతి పడుతున్నారన్నారు. రైతుల పేరు చెప్పుకుని చిరంజీవి అకౌంట్ సెటిల్ చేసుకున్నారని… ప్రభుత్వ మనుగడ పీఆర్పీ, ఎంఐంఎ చేతిలో ఉందని అంబటి విమర్శించారు. ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, మిశ్రమ ప్రభుత్వమని ఆయన అన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి