రివ్యూ : డ‌ర్టీపిక్షర్‌లో ‘డ‌ర్టీ’ లేదు


రేటింగ్ : 3.25/5
దర్శకత్వం: మిలన్ లూథ్రియా
నిర్మాణం : ఎక్తా కపూర్, శోభాకపూర్
క‌థ‌-మాట‌లు-స్ర్కీన్ ప్లే : రజత్ అరోరా
సంగీతం : విశాల్ శేఖర్
సినిమాటో గ్రఫీ : బాబీ సింగ్
నటీనటులు: విద్యా బాలన్, ససీరుద్దీన్ షా, ఇమ్రాన్ హస్మి, తుషార్ కపూర్ తదితరులు..

ఒకప్పటి దక్షిణాది సెక్సీ ఐటం గర్ల్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘డర్జీ పిక్చర్’… సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతుంది అన‌గానే అంద‌రిలోనే ఉత్కంఠ‌.. పైగా టైటిల్ కూడా డ‌ర్టీ పిక్షర్ అని అనౌన్స్ చేయ‌గానే.. ఈ చిత్రం ఖ‌చ్చితంగా సి గ్రేడ్ సెక్స్ సిన‌మాగా రూపొంద‌నుంద‌ని అంద‌రూ ఒక అంచ‌నాల‌కు తీసుకువ‌చ్చారు. న‌టికావాల‌నే పిచ్చితో సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి సెక్సీ తార‌గా ఓ వెలుగు వెలిగిన స్మిత జీవితం ఆధారంగా తీసిన ఈ చిత్రం క‌థా క‌మామీషు ఏమిటో చూద్దాం..

సినిమా కథలోకి వెళితే…
రేష్మా(విద్యా బాలన్) సినిమా హీరోయిన్ కావాల‌న్న ప‌చ్చి కోరిక‌తో ఇంట్లోనుండి పారిపోయి మ‌ద్రాసుకి చేరుకుంటుంది. అక్కడ అవ‌కాశాల కోసం అన్ని స్టూడియోలు తిరుగుతూ, ప‌స్తులుంటూ గ‌డుపుతుంటుంది.. అయితే ఆమె అదృష్టం కొద్దీ త‌మిళ సూప‌ర్ స్టార్ అయిన సూర్యకాంత్ (న‌సీరుద్దీన్ షా) సినిమాలో ఐట‌మ్ సాంగ్ అవ‌కాశం వ‌స్తుంది.. మొద‌ట్లో సూర్యకాంత్ ఆమెని తిర‌స్కరించినా.. సూర్యకాంత్‌తో సంబంధం పెట్టుకుని ఆ త‌ర్వాత తిరుగులేని ఐటం సాంగుల తారగా ఎదుగుతుంది రేష్మా. ఇక ఆమెకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.. అయితే ఆమెని ఆస్థాయిలోకి తీసుకువ‌చ్చిన సూర్యకాంత్‌కి ఆమె ఎదుగుద‌లని చూసి భ‌రించ‌లేక‌పోతాడు. మ‌రోవైపు ఆమెని ఎప్పుడూ అస‌హ్యించుకుంటూ ఉండే డైరెక్టర్ అబ్రహం (ఇమ్రాన్ హ‌ష్మీ), త‌నని పెళ్ళి చేసుకోవ‌డానికి సిద్దప‌డే సూర్యకాంత్ త‌మ్ముడు ర‌చ‌యిత అయిన ర‌మాకాంత్ (తుషార్ క‌పూర్‌) వీరి ముగ్గురు ఆమె జీవితాన్ని ర‌క‌ర‌కాల మ‌లుపులు తిప్పుతారు.. చివ‌రికి సూర్యకాంత్ రేష్మాకి అవ‌కాశాలు రాకుండా చేయ‌డంతో త‌నే సొంతంగా ఓ సినిమా తీసి చేతులు కాల్చుకుంటుంది.. అప్పులు మీద ప‌డిపోత‌యి.. ఆదుకునే వారెవ‌రూ క‌నిపించ‌రు.. దానితో తీవ్ర మ‌నోవేధ‌న‌కి గుర‌యిన రేష్మా ఆత్మహ‌త్య చేసుకుంటుంది..


విశ్లేషణ..
డ‌ర్టీపిక్షర్ అన్న టైటిల్ పెట్టి.. సినిమాని ఇంత చ‌క్కగా రూపొందించినందుకు ద‌ర్శకుడు మిల‌న్ లూథ్రియా అభినంద‌నీయుడు. ఓ సెక్సీస్టార్ జీవితాన్ని తెరకెక్కించ‌డం అన్నదే చాలా రిస్క్‌తో కూడుకున్నది.. ఏమాత్రం బ్యాలెన్స్ త‌ప్పినా అది వ‌ల్గర్ మూవీగా మారిపోతుంది.. కానీ ఈ డ‌ర్టీ పిక్షర్‌ని ద‌ర్శకుడు ప్రతీ స‌న్నివేశాన్ని ఎంతో చ‌క్కగా మ‌లిచాడు. ఎక్కడా వ‌ల్గారిటిగా ఉంద‌న్న భావ‌న ప్రేక్షకుడికి రానీయ‌కుండా జాగ్రత్తప‌డ్డాడు.. ప‌క్కా క‌థ‌-క‌థ‌నం చిత్రానికి ప్లస్‌పాయింట్ అయ‌తే హీరోయిన్ విద్యాబాల‌న్ న‌ట‌న ఈ చిత్రనికే పెద్ద హైలెట్‌.. ఆమె న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది.. హీరోయిన్‌గా కావాల‌న్న ఆశ‌తో మ‌ద్రాసుకి అడుగుపెట్టిన అమ్మాయిగా ఆమె చాలాబాగా చేసింది.. అలాగే చివ‌ర్లో తాను ఆత్మహ‌త్య చేసుకోబోయేముందు ఫోన్‌లో మాట్లాడిన చివ‌ర మాట‌లకి ఆమె మొహంలోని ఎక్స్‌ప్రెష‌న్స్ మ‌న‌సుక హ‌త్తుకుంటాయి.. గతంలో ‘వన్స్ అప్ అన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ చిత్రంతో తన టాలెంట్ చూపెట్టిన మిలన్ ఈ సినిమా ద్వారా రియల్ స్టోరీలను తెరకెక్కించడంలో తనకు తానే సాటి అని చాటి చెప్పాడు. ఈ చిత్రం 80వ ద‌శ‌కంలోని కాలానికి సంబంధించింది కాబ‌ట్టి అప్పటి వాతావ‌ర‌ణాన్ని తెర‌పై చాలా చ‌క్కగా ఆవిష్కరించారు.. అప్పుడు తార‌లు వాడే కాస్ట్యూమ్స్‌, మారుతి 800 కార్లు.. మేక‌ప్ ఇలా ప్రతీ విభాగంలోనూ అప్పటి వాతావ‌ర‌ణాన్ని చ‌క్కగా చూపించ‌గ‌లిగారు.. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. కాస్టూమ్స్, నృత్యాలు బాగా కుదిరాయి. అప్పట్లో సినిమా ఇండ‌స్ట్రీలో ఉండే రాజ‌కీయాల‌ను చాలా చ‌క్కగా ప్రజెంట్ చేశారు.. సినిమా తొలి సగ భాగం కమర్సియల్ గా సరదాగా సాగుతుంది. రెండో సగ భాగం సినిమాలోని ప్రధాన పాత్ర యొక్కచీకటి కోణాన్ని ఆవిష్కరించారు. అయితే ప‌స్టాఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా సాగిపోగా.. సెకండాఫ్‌లో ఎమోష‌న్ సీన్స్ ఎక్కువ‌గా ఉండ‌డ ఈ చిత్రానికి మైన‌స్ పాయింట్‌..


పెర్ఫార్మెన్స్..
సిల్మ్ స్మిత పాత్రలో విద్యాబాలన్ జీవించింది.. ఆమె అభిన‌యం, శృంగారాన్ని ఒల‌క‌బోసే విధానం, చాలా చ‌క్కగా చేసింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ చిత్రం మొత్తం మ‌న్ ఉమెన్ షో అనుకునేట‌ట్టుగా విద్యా న‌టించింది.. అంద‌ల ఆర‌బోత‌కి ఏమాత్రం వెనుక‌డుగు వేయ‌క‌పోయినా.. క‌థా ప‌రంగా ఆ స‌న్నివేశాలు అవ‌స‌రం కాబ‌ట్టి.. ఆ స‌న్నివేశాలని ద‌ర్శకుడు జ‌గుప్సాక‌రంగా తీయ‌లేదు కాబ‌ట్టి.. ఆమె న‌ట‌న అద్భుతంగా ఆక‌ట్టుకుంటుంది.. ఇక ఈ చిత్రంలో మ‌రో ముఖ్యమైన పాత్ర న‌సీరుద్దీన్ షాది.. సూర్యకాంత్ పాత్రలో న‌సీరుద్దీన్ షా చాలా బాగా చేసాడు.. సూప‌ర్‌స్టార్ గా అత‌ని న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.. ఇక సినిమా ద‌ర్శకుడుగా న‌టించిన ఇమ్రాన్ హ‌స్మీ పాత్ర సినిమా మొత్తం క‌నిపించినా చిన్న పాత్రే.. అయినా అత‌ని పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇంత‌కుముందు ఇలాంటి పాత్రల‌లో ఇమ్రాన్‌ని చూడ‌క‌పోవ‌డంతో కొత్తగా క‌నిపిస్తాడు.. డైలాగ్ డెలివ‌రీ విష‌యంలో కూడా ఇమ్రాన్ చ‌క్కటి పెర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌రిచాడు. ర‌చ‌యిత‌గా క‌నిపంచిన తుషార్ క‌పూర్ పాత్ర ఎందుకో అసంపూర్తిగా అనిపిస్తుంద‌.. ఉన్నంత‌లో బాగానే చేశాడు. మిగ‌తా న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్ ఫ‌ర్వాలేదు..

ఈ చిత్రానికి మ‌రో ప్లస్‌పాయంట్ మాట‌లు..
ర‌జ‌త్ అరోరా చాలా చ‌క్కని సంభాష‌ణ‌లు అందించారు.. ఓ స‌న్నివేశంలో హీరో సూర్యకాంత్‌, రేష్మాని ఉద్దేశించి అంటాడు.. సిగ‌రెట్ ప్యాకెట్ క‌వ‌ర్ ఉన్నా ఒక‌టే లేక‌పోయినా ఒకటే.. అలాగే.. నా చిత్రంలో నువ్వు ఉన్న ఒక‌టే లేక‌పోయినా ఒక‌టే అని.. దానికి రేష్మా.. వ‌ర్షం వ‌స్తే సిగ‌రెట్ పాకెట్‌తో స‌హ సిగ‌రెట్లు కూడా త‌డిసిపోతాయి.. అతే క‌వ‌ర్ ఉంటే వాటికి సెక్యూరిటీగా ఉంటుంది.. అన్న డైలాగ్ థియేట‌ర్లో క్లాప్ క‌ట్టించింద‌.. అలాగే నొప్పే లేకుంటే జీవితాన్ని జ‌యించ‌లేము సార్‌, సినిమా ఆడ‌డానికి మూడే కార‌ణాలు అవి.. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.., ఎంగిలాకు ఎంత ఎత్తుకెదిగినా చివ‌రికి ప‌డాల్సింద చెత్త‌కుప్పలోనే క‌దా.., చివ‌రికి రేష్మా సూసైడ్‌నోట్‌లో అంద‌రూ నా న‌డ‌ముని ప‌ట్టి పిస‌క‌డానికి చూసారుగానీ.. నా త‌ల‌పై చేయిపెట్టి ఆశీర్వదించేవారే లేరు.. లాంటి మాట‌లు హ‌త్తుకుంటాయి..
చివ‌ర‌గా.. డ‌ర్టీ పిక్షర్ అని టైటిల్ పెట్టి మంచి చిత్రాన్ని అందించారు ద‌ర్శక‌నిర్మాత‌లు, అయితే శృంగార తార సిన‌మా తీయాలంటే శృంగారం పాలు కూడా ఉండాలి కాబ‌ట్టి ఈ చిత్రంలో శృంగారం మాత్రమే ఉంది.. వ‌ల్గారిటీ లేదు.. కాబ‌ట్టి శృంగారం కావ‌ల‌నుకునే వారు, చ‌క్కని సినిమాని చూడాల‌నుకునే వారిక ఈ చిత్రం న‌చ్చుతుంది..
-సిహెచ్ సంతోష్‌కృష్ణ
santoshkrihnach@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!