‘పంజా’ మూవీ ప్రివ్యూ


తమిళ దర్శకుడు విష్ణు వర్దన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వ‌స్తున్న చిత్రం పంజా.  సంఘమిత్రా ఆర్ట్స్ బ్యానర్ పై నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డలు ఎంతు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ క్యారక్టరైజేషన్ అతని ముందు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. ముంబాయి మాఫీయా నేపద్యంలో ఈ చిత్రం చాలా థ్రిల్లింగ్ గా సాగుతుందట. ఈ సినిమాలో పవన్ క్యారక్టర్ పేరు జాక్సన్ రాబర్ట్ అని విశ్వసనీయ సమాచారం. పవన్‌కల్యాణ్ ’పంజా’ పబ్లిసిటీలో భాగంగా మూవీ టైటిల్, మూవీ స్టిల్స్ రిలీజ్ చేసారు. టైటిల్ మాస్‌ ను అలరించి ఆకట్టుకునే విధంగా వుంటే, స్టిల్స్ స్టైలిష్‌గా వున్నాయి. వీటికి మంచి స్పందనలభిస్తోంది. అలాగే ఈ సినిమాపై అంచనాలు కూడా పెంచుతున్నాయి. మాస్ స్టైలిష్ మూవీ అనే ఫీల్ క్రియేట్ చేసింది. మూవీ ట్రైలర్స్..ఆడియో కోసం ఆత్రంగా ఎదురుచూసేలా చేసాయనే చెప్పవచ్చు. కొత్తదనం, మాస్ వుంది. ఎంటర్‌ టైన్‌ మెంట్ మిస్ అవ్వలేదంటున్నారు కాబట్టి, ఆ ఎంటర్‌ టైన్‌ మెంట్ ఏ విధంగా ఉంటుందో అని అప్పుడే చర్చలు మొదలెట్టేశారు.
అలాగే ఈ చిత్రంలో మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ డ్యుయెల్ రోల్స్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఓ పాత్ర, ప్రజెంట్ లో ఓ పాత్ర ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఈ రెండు పాత్రలు అద్భుతంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాన్ తో పాటు అంజలీ లావానియాల మద్య వచ్చే బెల్లీ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందట.
ఈ చిత్రం డిసెంబ‌ర్ 9న ప్రపంచ‌వ్యాప్తంగా రిలీజ్‌కి సిద్దమ‌యింది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, మెగాభిమానుల్లో భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఈ మ‌ధ్య ప‌వ‌న్‌కి స‌రైన స‌క్సెస్ లేక‌పోవ‌డంతో ఈ పంజా చిత్రాన్ని ఎంతో క‌సిగా చేశార‌ని.. ఎట్టిప‌రిస్థితిలోనూ సూప‌ర్‌హిట్ కొట్టాల‌న్న ల‌క్ష్యంతో ఈ సినిమాకి ప‌నిచేశార‌ని తెలుస్తోంది. ఇక‌పోతే ఈ చిత్రంలోని కొన్ని ప‌వ‌ర్‌ఫుల్‌ డైలాగ్స్ ఇప్పటికే మెగాభిమానుల్లో ఓ ఊపు ఊపేస్తున్నాయి. పంజా చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్టవుతుంద‌ని ఇప్పటికే ఓ అంచనాకి వ‌చ్చారు. సో.. మ‌రో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకి వ‌స్తున్న పంజా చిత్రం ఏ స్థాయి విజ‌యాన్ని అందుకుంటుందో వేచిచూడాలి.. ఈ చిత్రానికి అబ్బూరు రవి డైలాగ్స్ అందిస్తున్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!